ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్‌లో అమీతుమీకి భారత్ సై అంటోంది. మొతేరాలో జరిగే మూడో టెస్ట్‌లో స్పిన్ పిచ్‌తో ఇంగ్లండ్‌ను ఊహించని దెబ్బ కొట్టిన టీమిండియా సిరీస్ ఆధిక్యాన్ని 2-1కి పెంచుకుంది. అదే ఊపుతో ఆఖరి టెస్ట్‌లోనూ ప్రత్యర్థిని మట్టి కరిపించి సిరీ్‌సను విజయంతో ముగించాలని భావిస్తోంది. మరోవైపు వరుసగా రెండు టెస్ట్‌ల్లో ఘోర పరాజయం చవిచూసిన ఇంగ్లండ్ ఆఖరి మ్యాచ్‌లో ఊరట విజయం అందుకోవాలని పట్టుదలగా ఉంది. ఒకవేళ ఇంగ్లండ్ నెగ్గితే ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షి్‌పన అంతిమ సమరానికి ఆస్ట్రేలియా క్వాలిఫై అవుతుంది. అయితే ఉరకలేసే ఉత్సాహంతో ఉన్న భారత్‌పై పర్యాటక జట్టుకు అది సాధ్యమా అన్నది ప్రశ్న.

భారత్ దూకుడుగానే..
చివరి టెస్ట్‌ను టీమిండియా డ్రా చేసుకుంటే సరిపోతుంది. దాంతో న్యూజిలాండ్‌తో (జూన్ 18 నుంచి 22) వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షి్‌ప ఫైనల్‌లో తలపడుతుంది. కానీ కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి దూకుడును గమనిస్తే..భారత్ చివరి టెస్ట్‌లో రక్షణాత్మకంగా ఆడే అవకాశాలు కనిపించడంలేదు. కొత్తగా ప్రారంభమైన మొతేరా స్టేడియంలో పూర్తిగా టర్నింగ్ వికెట్‌తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన భారత్ మూడో టెస్ట్‌ను కేవలం రెండు రోజుల్లోపే ముగించింది. ముఖ్యంగా లెప్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ నేరుగా వికెట్ల మీదకే బంతులు వేయడం ద్వారా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపాడు. చెన్నైలో జరిగిన రెండో టెస్ట్‌లో స్పిన్ పిచ్‌పై ఇంగ్లండ్ తడబాటును చూసిన భారత్..మొతేరాలో మరింత టర్నింగ్ ట్రాక్‌తో పర్యాటక జట్టుకు షాకిచ్చింది. ఈ నేపథ్యంలో నాలుగో టెస్ట్‌కు సైతం స్పిన్ పిచ్‌నే రూపొందించే అవకాశాలున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చా యి. కానీ ‘గులాబీ’తో పోలిస్తే ఎర్ర బంతి పిచ్‌నుంచి జారిపోయే అవకాశాలు తక్కువ. అందువల్ల ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగబోదని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా అక్షర్ పటేల్, అశ్విన్ మరోసారి ఇంగ్లండ్‌ను ఇబ్బందిపెట్టడం ఖాయం. బౌలింగ్‌లో టీమిండియాకు ఎలాంటి సమస్యలు లేకపోయినా..బ్యాటింగే ఆందోళనగా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రమే మూడు ఇన్నింగ్స్‌ల్లో 296 పరుగులు చేయడం ద్వారా పర్లేదనిపించాడు. అశ్విన్ 176 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడంటే ఇతర బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో ఆడుతున్నారో అర్థమవుతుంది. రెం డు హాఫ్ సెంచరీలు సాధించినా..అది కోహ్లీకి స్థాయికి తగ్గ ప్రదర్శన కాదు. ఇక రహానె, పుజార, శుభ్‌మన్ గిల్ కూడా మూడు టెస్ట్‌ల్లో కేవలం ఒక్కసారే రాణించారు. ఈ టెస్ట్‌కు పేసర్ బుమ్రా అందుబాటులో ఉండడంలేదు. ఫలితంగా ఉపఖండం పిచ్‌లపై సత్తాచాటే ఉమేశ్ యాదవ్ అతడి స్థానంలో జట్టులోకి వచ్చే చాన్సుంది.
ఇంగ్లండ్‌జట్టు ఎంపిక పేలవం
పోరాడితే పోయేదీమీ లేదు..అన్న చందంగా ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ బరిలోకి దిగుతోంది. కానీ జట్టు ఎంపికలో లోపాలే రూట్‌సేనకు ప్రతిబంధకంగా మా రాయి. కెప్టెన్ జో రూట్ (333 పరుగులు) తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేశాడు. అతడి తర్వాత అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ స్టోక్స్ (146 రన్స్). కానీ వీరిద్దరికీ మధ్య 187 పరుగులు అంతరం ఉండడం బ్యాట్స్‌మెన్ ఎంపికలో ఆ జట్టు లోపాలను ఎత్తి చూపుతోంది. ఇంకా.. రెండో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేని లోటు మొతేరాలో కనిపించింది. అప్పుడప్పుడు బౌలింగ్ చేసే రూట్ (5/8) ఐదు వికెట్లు తీయడంతో అదే పూర్తిస్థాయి స్పిన్నర్ ఉంటే ఇంగ్లండ్ పరిస్థితి వేరేగా ఉండేది. ప్రధాన స్పిన్నర్ జాక్ లీచ్ (16 వికెట్లు) తన పాత్రను సమర్థంగా పోషిస్తున్నా..అక్షర్‌తో పోలిస్తే తేలిపోయాడు. నాలుగో టెస్ట్‌కూ స్పిన్ పిచ్ తయారు చేస్తే మరోసారి లీచ్ కీలకం అవుతాడు. స్పిన్ ట్రాక్ అయితే పేసర్ బ్రాడ్‌కు బదులు డామ్ బెస్ తుది జట్టులోకి రానున్నాడు.
0
స్వదేశంలో 2012 నుంచి భారత్ రెండు టెస్ట్‌ల్లో ఎప్పుడూ పరాజయం చవిచూడలేదు. అలాగే అప్పటినుంచి
ఇంగ్లండ్‌పై సిరీస్ కూడా ఓడిపోలేదు.
49/60
ఈ సిరీస్ మూడు టెస్ట్‌ల్లో ఇంగ్లండ్ 60 వికెట్లు కోల్పోతే అందులో 49 భారత స్పిన్నర్లు తీసినవి.
5
ఆంబ్రోస్ 405 టెస్ట్ వికెట్ల రికార్డును అధిగమించేందుకు అశ్విన్‌కు కావాల్సిన వికెట్లు. అశ్విన్ 77 టెస్ట్‌ల్లో 401 వికెట్లు పడగొట్టాడు.
9
అత్యధిక టెస్ట్ వికెట్లు తీసిన కుంబ్లే రికార్డు (132 టెస్ట్‌ల్లో 619)ని అధిగమించేందుకు పేసర్ అండర్సన్‌కు కావాల్సిన వికెట్లు. అండర్సన్ 159 టెస్ట్‌ల్లో 611 వికెట్లు సాధించాడు.
26
వెస్టిండీస్ లెజెండ్ క్లైవ్ లాయిడ్ రికార్డును తిరగరాసేందుకు కోహ్లీకి కావాల్సిన పరుగులు. విరాట్ 90 టెస్ట్‌ల్లో 7490 పరుగులు సాధించాడు. లాయిడ్ 110 టెస్ట్‌ల్లో 7515 రన్స్ చేశాడు.
4
స్వదేశంలో 100 వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచేందుకు పేసర్ ఉమేశ్‌కు కావాల్సిన వికెట్లు.
పిచ్/వాతావరణం
మూడో టెస్ట్ మాదిరే స్పిన్ వికెట్‌గా అంచనా. మ్యాచ్ జరిగే సమయంలో, అన్ని రోజులూ అత్యధికంగా 30 డిగ్రీల సెల్సియస్ ఎండ ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది.
జట్లు
భారత్ (అంచనా): కోహ్లీ (కెప్టెన్), రోహిత్, శుభ్‌మన్ గిల్, పుజార, రహానె, పంత్, సుందర్, అశ్విన్, అక్షర్ పటేల్, ఇషాంత్, ఉమేశ్.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), జాక్ క్రాలే, డామ్ సిబ్లే, బెయి ర్ స్టో, బెన్ స్టోక్స్, ఓలీ పోప్, బెన్ ఫోక్స్ (కీపర్), డామ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, స్టువర్ట్ బ్రాడ్/జేమ్స్ అండర్సన్.