విరాట్‌ @100 మిలియన్‌

0
218
Spread the love

బ్యాటుతో పరుగుల వరద పారించే విరాట్‌ కోహ్లీ.. మైదానం వెలుపలా రికార్డులు కొల్లగొడుతున్నాడు. సోషల్‌ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్‌ కలిగి ఉన్న ఈ టీమిండియా కెప్టెన్‌.. మరో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్‌ ఫాలోవర్ల (10 కోట్లు)ను కలిగి ఉన్న తొలి ఆసియా వ్యక్తిగా విరాట్‌ రికార్డు సృష్టించాడు. సోమవారం నాటికి ఇన్‌స్టాలో అతని ఫాలోవర్ల సంఖ్య సరిగ్గా వంద మిలియన్లు చేరుకుంది. బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా 60.8 మిలియన్‌ ఫాలోవర్లతో ఆసియా తరఫున రెండోస్థానంలో ఉంది. ఇక.. సాకర్‌ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో (266 మిలియన్‌), లియోనెల్‌ మెస్సీ (184 మిలియన్‌), నేమార్‌ (147 మిలియన్‌) తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న క్రీడా సెలెబ్రిటీ విరాట్‌ కోహ్లీనే కావడం విశేషం. అంతేకాదు.. ఇంతమంది ఫాలోవర్లు ఉన్న తొలి క్రికెటర్‌ కోహ్లీనే. విరాట్‌కు ఇప్పటికే ఫేస్‌బుక్‌లో 36 మిలియన్లు, ట్విటర్‌లో 40.8 మిలియన్‌ ఫాలోవర్లు ఉన్నారు. కాగా.. విరాట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క స్పాన్సర్డ్‌ పోస్ట్‌కు రూ. 1.29 కోట్లు తీసుకుంటాడని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here