మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయంగా అన్ని ఫార్మాట్లలో కలిపి 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. అలాగే ప్రపంచంలో ఈ ఘనత అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచింది. సౌతాఫ్రికాతో మ్యాచ్ 28వ ఓవర్లో అనె బాష్ బంతిని బౌండరీకి తరలించిన 38 ఏళ్ల మిథాలీ 10వేల రన్స్‌తో ఇంగ్లండ్‌కు చెందిన షాలెట్ ఎడ్వర్డ్స్ (309 మ్యాచ్‌ల్లో 10,273) తర్వాతి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా.. మ్యాచ్ అనంతరం మిథాలీ జట్టు సభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసింది.
టేక్-ఎ-బౌ : బీసీసీఐ
రికార్డు పుటలకెక్కిన మిథాలీని బీసీసీఐ అభినందించింది. ‘చాంపియన్ క్రికెటర్. 10వేల పరుగులు చేసిన తొలి భారత మహిళగా నిలిచావు. నీకు సలాం’ అని ట్వీట్ చేసింది.

నిలకడే కీలకం..
ఇంత సుదీర్ఘకాలం ఆటలో కొనసాగాలంటే నిలకడగా రాణించాలి. దానికి ఎంతో శ్రమించాలి. అలాగే మహిళల క్రికెట్‌లో వచ్చే మార్పులకు అనుగుణంగా నా ఆటను ఎప్పటికప్పుడు మార్చుకుంటా. దానికి నిదర్శనమే ఈ 10 వేల పరుగుల మైలురాయిని చేరడం. మిథాలీ రాజ్