పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి, గర్భవతిని చేసిన వివాహితుడు ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో నిందితుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసిన ఉదంతం ముంబై నగరంలో వెలుగుచూసింది. ముంబై నగరానికి చెందిన 25 ఏళ్ల వివాహితుడు ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిపాడు.దీంతో పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి జైలుకు పంపించారు. బాలిక గర్భం దాల్చడంతో రెండేళ్ల తర్వాత ఆమెను వివాహం చేసుకుంటానని నిందితుడు చెప్పాడు. దీంతో బాలిక తల్లి నిందితుడి విడుదలకు మద్ధతుగా అఫిడవిట్ సమర్పించింది. బిడ్డకు జన్మనిచ్చిన తన కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో బాధిత బాలిక తల్లి నిందితుడికి బెయిలు ఇవ్వాలని అభ్యర్థించారు. దీంతో కోర్టు నిందితుడికి బెయిలు మంజూరు చేసింది.