హైదరాబాద్/పేట్‌బషీరాబాద్ : అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. జేబులో డబ్బులు లాక్కొని గలాట సృష్టించిన నలుగురు ట్రాన్స్‌జెండర్లను పేట్‌బషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. దూలపల్లి గ్రామానికి చెందిన మల్లేశం నూతనంగా నిర్మించుకున్న ఇంటిలో సోమవారం గృహప్రవేశం చేశాడు. విషయం తెలుసుకున్న నలుగురు ట్రాన్స్‌జెండర్స్ స్వాతి, శ్రావణి, శివాణి, భూమి అతని ఇంటికి వెళ్లారు.

గృహప్రవేశం సందర్భంగా తమకు డబ్బులు ఇవ్వాలని, ఇచ్చేంత వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని గలాటా సృష్టించారు. డబ్బులు ఇవ్వడానికి మల్లేశం నిరాకరించడంతో.. ఇంటిపై రాళ్లు, మట్టి విసిరారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ మల్లేశం జేబులోని రూ.4వేలు లాక్కున్నారు. బాధితుడు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ట్రాన్స్‌జెండర్స్‌పై కేసు నమోదు చేసి, రిమాండుకు తరలించారు.