చదువు అయిపోన తర్వాత తనను దూరంగా పెడుతోందని తన కన్నా సూపర్ సీనియర్ విద్యార్థినిని వేదించాడో జూనియర్ స్నేహితుడు. చివరకు రాచకొండ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుషాయిగూడ ప్రాంతానికి చెందిన యువతి చదవివే స్కూల్లోనే తన కన్నా రెండు సంవత్సరాలు చిన్నవాడైన సాయికిరణ్‌తో స్నేహంగా ఉండేది. 2015లో ఆ యువతి పదోతరగతి పూర్తి చేసుకొని ఉన్నత విద్యను అభ్యసిస్తోంది. అప్పటి నుంచి సాయికిరణ్‌కు కాంటాక్టులో లేదు. ఫోన్ నంబర్ కోసం ప్రయత్నించగా 2019లో ఆ యువతి ఫోన్ నంబర్ సంపాదించాడు. ఆమెతో వాట్సా్ప్లో చాటింగ్‌లు చేస్తూ చనువు పెంచుకోవడానికి ప్రయత్నించాడు. అతని ఉద్దేశం అర్థం చేసుకున్న యువతి అప్పటి నుంచి సాయికిరణ్‌తో మాట్లాడడం మానేసింది. ఎలాగైనా ఆ యువతి పరువు తీయాలని భావించిన సాయికిరణ్…ఆమె పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రాంను క్రియేట్ చేశాడు.

అశ్లీల చిత్రాలను, అసభ్యకర మెసేజ్‌లను పోస్టు చేసేవాడు. ఆ చిత్రాలను యువతకి వాట్సాప్ చేసేవాడు. గుర్తుతెలియని నంబర్ల నుంచి న్యూడ్ వీడియోకాల్స్ చేసి వేధించేవాడు. ఆమె వీడియోకాల్ ఆన్ చేయగానే ఆమె ముఖాన్ని క్యాప్చర్ చేసేవాడు. తనతో వీడియోకాల్స్ మాట్లాడకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించేవాడు. విసిగిపోయిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాచకొండ సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు.