గిఫ్టులు అంటారు, స్క్రాచ్ కార్డులంటారు.. బహుమతి గెలుచుకున్నారని ఊరిస్తారు.. ఆ తర్వాత బురిడి కొట్టిస్తారు. ఇలా మోసాలకు పాల్పడుతున్న ఈ కామర్స్ ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కామర్స్ వెబ్ సైట్‌లలో షాపింగ్ చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇదే అదనుగా కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. గిఫ్టులు పేరుతో అమాయకులకు వల వేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. ఈ ముఠా జార్ఖండ్ కేంద్రంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. గిఫ్ట్, స్క్రాచ్ కార్డులో కారు వచ్చిందంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇలా మోసాలు చేసిన 10 మందిని పోలీసులు గుర్తించారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. అరస్టయినవారిలో జార్ఖండ్, మంచిర్యాలకు చెందినవారు ఉన్నారు. ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు తరుణ్ కుమార్‌తోపాటు మరో 9 మందిని పోలీసులు అసెస్టు చేశారు
