స్మగ్లర్లు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా కస్టమ్స్ అధికారుల చేతికి చిక్కుతున్నారు. తాజాగా చెన్నై ఎయిర్ పోర్టులో 44 కేజీల డ్రగ్స్ సీజ్ చేశారు. ఇంత భారీ మొత్తంలో మత్తు పదార్థాలను తరలించేందుకు స్మగ్లర్లు చాలా తెలివిగా వ్యవహరించారు. కానీ కస్టమ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. వెయింగ్ మిషన్లలో మత్తు పదార్థాలను ఎంతో పకడ్బందీగా దాచారు. సాధారణ బరువు కన్నా కాస్త బరువుగా మిషన్ కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దాంతో మిషన్ లోపల ఓ నల్లని బాక్స్‌ను గుర్తించారు. దీంతో అన్ని వెయింగ్ మిషన్లను తెరిచి చూశారు. మొత్తంగా 44 కేజీల డ్రగ్స్ బయటపడింది. దాని విలువ రూ. 5.1కోట్ల విలువ ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
