జొమాటో డెలివరీ బాయ్‌ దౌర్జన్యం.. రక్తమోడేలా యువతిపై దాడి!

0
424
Spread the love

జొమాటో డెలివరీ బాయ్ ఒక మహిళపై దాడికి పాల్పడ్డాడు. స్వల్ప వివాదంతో ఆమె రక్తమెచ్చేలా అనుచితంగా దాడిచేశాడు. బెంగళూరులో ఈ దారుణం జరిగింది. ఈ ఘటన తాలూకు పూర్తి వివరాలను బాధితురాలు ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ నెత్తురోడుతున్న తన ముఖంతో ఉన్న వీడియోను అప్‌లోడ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్‌లో సంచలనంగా మారింది. మార్చి 9 న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ ఇచ్చానని, సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉందని, అయితే సమయానికి ఆర్డర్ రాలేదని ఆమె ఆరోపించారు. దీంతో ఆర్డర్ ఆలస్యం కావడంపై కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడి, తన ఆర్డర్‌ క్యాన్సిల్‌ చేయాలని బెంగళూరుకు చెందిన కంటెంట్ సృష్టికర్త మేకప్ ఆర్టిస్ట్‌ హితేషా కోరింది.

ఇంతలోనే డెలివరీ బాయ్‌ఆర్డర్‌ తీసుకొని వచ్చాడు. ఈ సందర్భంగా వాదనకు దిగిన డెలివరీ ఎగ్జిక్యూటివ్ కామరాజ్ ఆగ్రహంతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. తరువాత తన ఆర్డర్‌ను తీసుకొని మరీ పారిపోయాడని ఆమె తెలిపారు. జొమాటో సేవలు సురక్షితమేనా అని ఆమె ప్రశ్నించారు. ఈ విషయంలో తనకు మద్దతుగా నిలవాలని ఆమె కన్నీటితో నెటిజన్లను అభ్యంర్థించారు. మరోవైపు.. క్యాన్సిలైన్ ఆర్డర్ల విషయంలో డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు నిబంధనలు అతిక్రమిస్తున్నారని, దారి మధ్యలో కొంత ఆహారాన్ని తిని, మిగితాది డెలివరీ చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. తమకు ఏమాత్రం అనుమానం కలిగినా వెంటనే ఆర్డర్లు క్యాన్సిల్ చేస్తున్నట్టు నెటిజన్లు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here