దారుణం: తల్లిని కడతేర్చిన కసాయి కూతురు

0
272
Spread the love

కన్నతల్లిని కుమార్తె హత్య చేసిన ఘటన గుంటూరు నగరంలో చోటు చేసుకుంది. నగరంపాలెం పోలీసుల కథనం మేరకు… ఏటీ అగ్రహారం జీరో లైనులో నివసించే పూతాబత్తిని భూలక్ష్మి (58)కి కుమారుడు నాగరాజు, కుమార్తె దాసరి అలియాస్‌ భవనం రమాదేవి ఉన్నారు. ఆరేళ్ల కుమారుడు రాహుల్‌రెడ్డితో కలిసి రమాదేవి తల్లి వద్దే ఉంటోంది. వ్యసనాలకు బానిసగా మారిన రమాదేవి కుమారుడిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది.

Woman Assassinated Mother In Guntur - Sakshi

ఈ క్రమంలో 25వ తేదీ రాత్రి రమాదేవి బయటకు వెళ్లడంతో కుమారుడు రాహుల్‌ ఆహారం తీసుకోకుండా ఏడుస్తుండటంతో తల్లి భూలక్ష్మి కుమార్తెకు ఫోన్‌ చేసి ఇంటి రావాలని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత తల్లీకుమార్తెల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రమాదేవి తల్లి భూలక్ష్మి గొంతు నులుముతుండగా నాగరాజు గమనించి, అడ్డుకుని, విడిపించాడు. అనంతరం తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ భూలక్ష్మి మృతిచెందింది. నాగరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here