పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓ యువతిని ఇంటికి పిలిచి లైంగిక దాడి చేశాడో విద్యార్థి. కార్మికనగర్‌కు చెందిన రాజు బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. నగరానికి చెందిన బీకాం చదువుతున్న ఓ యువతితో పరిచయం ఏర్పడి.. ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. రెండు రోజులక్రితం తన ఇంటికి రావాలని కోరాడు. ఒత్తిడి చేయగా ఒప్పుకుని అతడి ఇంటికి వెళ్లింది. మాయ మాటలు చెప్పిన రాజు ఆమెపై లైంగిక దాడి చేశాడు. బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు రాజుపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
