బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 12 ఏళ్ల జైలు

0
180
Spread the love

హైదరాబాద్/చిక్కడపల్లి : బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తికి 12ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నాంపల్లి ఫస్ట్‌ అడిషనల్‌ ఎంఎస్‌జే న్యాయమూర్తి సునీత తీర్పునిచ్చారు.

2018 జూలై 25న రిసాలగడ్డకు చెందిన షేక్‌ మహమూద్‌(46) బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి ఎస్‌ఐలు ఈశ్వర్‌రావు, కోటేశ్వర్‌రావు ఆధారాలను సీసీ ఫుటేజీలను కోర్టుకు సమర్పించారు. న్యాయమూర్తి సునీత బుధవారం నిందితుడు షేక్‌ మహమూద్‌కు 12 ఏళ్లు జైలు శిక్ష, రూ. 1000 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. నిందితునికి శిక్ష పడేలా కృషి చేసిన సిబ్బందిని స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో శివశంకరరావు ప్రత్యేకంగా అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here