సైబర్ మోసాలు రోజూ వింటూనే ఉన్నాం.. ఇంటర్నెట్ వ్యవహారాలు, ఆన్ లైన్ లావాదేవీల్లో ప్రజలకు అంతగా అవగాహన లేకపోవడం వల్ల ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు మోసబోతూనే ఉన్నారు. ఆన్‌లైన్ ద్వారా జాబ్స్ పేరుతో ఇటీవల జరుగుతోన్న వరుస మోసాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీస్ రూపొందించిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు అందర్నీ ఆకర్షిస్తోంది. బ్రహ్మానందం కామెడీ సీన్లను జోడించి ఉద్యోగాల పేరుతో జరుగుతోన్న మోసాల గురించి ఆ వీడియోలో చూపించారు. ఈ వీడియోను హైదరాబాద్ సిటీ పోలీసులు ట్విట్టర్‌లో పోస్ట్ చేసి అవగాహన కల్పిస్తున్నారు.
