చిత్తూరు: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులైన తల్లిదండ్రులను మదనపల్లె సబ్ జైలు నుంచి విశాఖకు తరలించారు. పద్మజ, పురుషోత్తమ్‌ను విశాఖ ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ మానసిక వైద్యశాలకు అధికారులు తరలించారు.

మదనపల్లె సబ్ జైలులో పద్మజ మానసిక స్థితి యథాతదంగానే ఉంది. పగలు నిశ్సబ్దం…రాత్రి అయితే శివ..శివ అంటూ అరుపులు వేస్తోంది. దీంతో తోటి ఖైదీలు భయాందోళన చెందుతున్నారు. పద్మజ భర్త పురుషోత్తం మాత్రం సబ్ జైలులో ఏడుస్తూ ఢీలా పడిపోయారు.