మల్కాజిగిరి పోలీ స్‌స్టేషన్ పరిధి మల్లికార్జున నగర్‌లో నివాసముండే జాడె కవిత (36) ఈనెల 2న అదృశ్యమైంది. పిల్లలు లేకపోవడంతో బెంగపెట్టుకున్న ఆమె భర్తను వేరే పెళ్లిచేసుకోమని సూచిస్తూ ఉత్తరం రాసి ఇంట్లోపెట్టి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఆమెకోసం తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త జాడె రాకేష్‌కిరణ్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
