క్వార్టర్స్‌లో నడాల్‌

0
157
Spread the love

మెల్‌బోర్న్‌: స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ 13వసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. పురుషుల సింగిల్స్‌లో సోమవారం జరిగిన నాలుగో రౌండ్‌లో రెండోసీడ్‌ నడాల్‌ 6-3, 6-4, 6-2తో 16వ సీడ్‌ ఫాబియో ఫాగ్నినిపై నెగ్గాడు. కాగా, గాయం కారణంగా ప్రత్యర్థి మాటియో బెరిట్టినీ మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో ఐదోసీడ్‌ సిట్సిపాస్‌ నేరుగా క్వార్టర్స్‌ చేరాడు. నాలుగో సీడ్‌ మెద్వెదెవ్‌ 6-4, 6-2, 6-3తో మెక్‌డొనాల్డ్‌పై గెలిచాడు. ఏడోసీడ్‌ రుబలేవ్‌ 6-2, 7-6(3)తో ఆధిక్యంలో ఉన్నప్పుడు.. ప్రత్యర్థి కాస్పర్‌ రడ్‌ (నార్వే) గాయంతో తప్పుకోవడంతో అతడికి వాకోవర్‌ లభించింది. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్‌ అష్లే బార్టీ 6-3, 6-4తో షెల్బీ రోజర్స్‌పై, కరోలినా ముచోవా 7-6(5), 7-5తో ఎలిస్‌ మెర్టిన్స్‌పై, జెస్సికా పెగుల 6-4, 3-6, 6-3తో ఐదోసీడ్‌ స్విటోలినాపై, జెన్నిఫర్‌ బ్రాడీ 6-1, 7-5తో డోనా వికిక్‌పై గెలిచి క్వార్టర్స్‌ చేరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here