కరోనా వైరస్ తాకిడికి కొత్త కొత్తగా ఆలోచించాల్సి వస్తుంది మరి. బయట వస్తువుల్ని ఇంట్లోకి తీసుకురావాలంటే భయంగా ఉంటుది. అలా అని వంట చేసుకోకుండా ఉండలేం కదా. తప్పనిసరిగా తెచ్చుకొని వాటిని పసుపు నీటిలో వేసి బాగా శుభ్రపరుచిన తర్వాత ఆరబెట్టిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టుకుంటున్నాం. అయినా వైరస్ తొలిగిపోతుందని గ్యారెంటీగా చెప్పలేం. అందుకే మనుషులకు ఉపశమనాన్నిచ్చే ఆవిరితోనే వైరస్‌ను చంపేయాలనుకున్నాడో వ్యక్తి.
అందుకు కుక్కర్‌లోని ఆవిరినే ఉపయోగించుకున్నారు. కుక్కర్‌కు విజిల్ వచ్చే రంధ్రం దగ్గర ఒక పైపు పెట్టి కూరగాయలను శుభ్రపరుస్తున్నాడు. టమాట, కాకరకాయ, ఉల్లికాడలు ఇలా బయట తెచ్చుకున్న అన్ని కూరగాయలను ఆవిరితో కడిగేస్తున్నాడు. ఆవిరి వేడికి కరోనాకు దిమ్మతిరిగిపోవడం ఖాయం. ఈ పద్ధతి శానిటైజర్ కన్నా ఉత్తమమైనది. ఇలాంటి వినూత్న ఐడియాలు సోషల్ మీడియాలోకి వస్తే వైరల్ కాకుండా ఉండవు. కాకపోతే కుక్కర్‌తో కాస్త జాగ్రత్తగా ఉండాలి లేదంటే బ్లాస్ట్ అవకాశం ఉంటుంది.