గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్: ఆ సెట్ ఖర్చెంతో తెలుసా?

0
140
Spread the love

రోమియో ప్రేమ కోసం చచ్చాడు.. నేను ఆ టైప్ కాదు అంటూ గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రాధేశ్యామ్ యూనిట్ గ్లింప్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. వింటేజ్ స్టైల్లో ఉన్న ఆ వీడియో, అందులోని ప్రభాస్ లుక్, పురాతన రైల్వే స్టేషన్ సెట్ ఆకట్టుకున్నాయి.

ఈ సెట్ డిజైనింగ్ కోసం నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారట. ఆ వీడియోలో కనిపించిన ట్రైన్ సెట్ కోసం ఏకంగా 1.6 కోట్లు రూపాయలు ఖర్చు పెట్టారట. ఈ సెట్ కోసం 250 మంది 30 రోజుల పాటు కష్టపడ్డారట. పీరియాడిక్ డ్రామాగా ఇటలీ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇలాంటి ఎన్నో సెట్‌లను నిర్మించారట. ఎంతో జాగ్రత్తగా పురాతన ఇటలీ లుక్‌ను తీసుకొచ్చారట.

రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక. పాన్‌ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ చిత్రానికి దక్షిణాది భాషల్లో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం జూలై 30న విడుదలవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here