ఘనంగా ప్రారంభమైన సమంత – గుణశేఖర్‌ల ‘శాకుంతలం’..!

0
192
Spread the love

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం బహిస్తున్నాడు. పాన్ ఇండియన్ సినిమాగా గుణ టీం వర్క్స్ బ్యాన్‌పై నీలిమ గుణ ఈసినిమాని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో శాకుంతలం సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించారు. ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ అవడంతో తాజాగా ఈ సినిమా ప్రారంభోత్వవం పూజా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. కాగా త్వరలో శాకుంతలం సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలబోతోంది. ఇక ఈసినిమాలో దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మాణ సంస్థ కూడా ఈ సినిమాకి భాగస్వామ్యం అవుతోంది. దిల్ రాజు ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌లో భాగమవడంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here