శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 22: సాధారణంగా నివాస ప్రాంతం మారాలంటే ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకుంటారు. స్థోమత ఉంటే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కానీ శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టిమ్ బ్రౌన్ మాత్రం కొత్తగా ఆలోచించాడు. సుమారు 139ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటిని వదులుకోవడానికి ఇష్టపడక.. ఈ విధంగా ఏకంగా చక్రాలపై ఎక్కించి ఇంటిని తరలించాడు. ఇంతా చేసి, ఇంటిని తరలించింది అరకిలోమీటరు మాత్రమే. కానీ అందుకు అయిన ఖర్చు మాత్రం ఏకంగా రూ. 2.9కోట్లు. ఇంత పెద్ద ఇల్లు చక్రాలపై కదిలి వెళ్తుంటే చూపరులంతా అలా నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండిపోవడం కొసమెరుపు.
