ఉస్మాద్, ఎనర్జిటిక్‌స్టార్ రామ్ పోతినేని సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారా.

ఎందుకు? అనే సందేహం రాక మానదు. హీరో రామ్ శివుని మాలను వేసుకుని దీక్ష తీసుకున్నారు. ఈ మాలను వేసుకోవడంతో 41 రోజుల పాటు దీక్ష ఉండాలని.. అందుకనే రామ్ కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకోవాలని అనుకున్నాడు. తాను శివుని మాలతో ఉన్న ఫొటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసిన రామ్, “ఓం నమః శివాయ, చిన్న బ్రేక్ తీసుకున్నాను. మళ్లీ వస్తాను” అంటూ మెసేజ్‌ను పోస్ట్ చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన రామ్ తదుపరి సినిమా ఏంటనే విషయంపై అధికారిక సమాచారం లేదు. మరి బ్రేక్ తర్వాత ఈ విషయంపై రామ్ క్లారిటీ ఇస్తాడేమో చూడాలి.