చిన్న వ్యాపారులకు తక్కువ ధరకే జియో బ్రాడ్‌బ్యాండ్‌

0
192
Spread the love

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలకు (ఎంఎ్‌సఎంబీ) తక్కువ ధరకే బ్రాడ్‌బ్యాండ్‌ సేవలందించనున్నట్టు రిలయన్స్‌ జియో ప్రకటించింది. సెకండ్‌కు 100 మెగాబిట్‌ అప్‌లోడ్‌, డౌన్‌లోడ్‌ సామర్థ్యంతో అన్‌లిమిటెడ్‌ వినియోగ అవకాశం గల ప్లాన్‌ రూ.901కే అందుబాటులో ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఎంఎ్‌సఎంబీలు కనెక్టివిటీ, ప్రోడక్టివిటీ, ఆటోమేషన్‌ పరికరాలపై నెలకి రూ.15,000 నుంచి రూ.20,000 వరకు ఖర్చు చేస్తున్నాయంటూ వారికి మార్కెట్‌ ధర కన్నా 10 శాతం తక్కువ ధరకే ఈ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని, వారి సాధికారత దిశగా ఇది తొలి అడుగు అని జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అంబానీ తెలిపారు.

అలాగే రూ.5,000 ధరకే దూర ప్రదేశం నుంచే ఉద్యోగుల పర్యవేక్షణ, వీడియో కాన్ఫరెన్సింగ్‌, డివైస్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ సేవలు అందిస్తామన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి ఎంఎ్‌సఎంబీలు ఆత్మనిర్భర్‌ డిజిటల్‌ ఇండియా దిశగా పయనం సాగించగలుగుతాయని చెప్పారు. తొలిదశలో 5 కోట్ల ఎంఎ్‌సఎంబీ కస్టమర్లను సాధించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1 జీబీపీఎస్‌ వేగంతో కూడిన రూ.901 నుంచి రూ.10,001 శ్రేణితో ఏడు టారిఫ్‌ ప్లాన్లను కంపెనీ ఈ సందర్భంగా విడుదల చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here