చూస్తూ చూస్తుండగానే…

0
180
Spread the love

కేదార్‌నాథ్‌ వరద కన్నా ఎక్కువ..

2013 జూన్‌లో కేదార్‌నాథ్‌ను ముంచెత్తి దాదాపు ఆరువేల మంది ప్రాణాలను బలిగొన్న వరదలు గుర్తున్నాయా? ఆ సమయంలో జోషీమఠ్‌ వద్ద ధౌలీ గంగా నది నీటి మట్టం రికార్డు స్థాయిలో 1385.54 మీటర్లుగా నమోదైంది. అలాంటిది.. ఆదివారం మధ్యాహ్నం 11 గంటల సమయంలో 1388 మీటర్లుగా నమోదు కావడం వరద తీవ్రతకు నిదర్శనం. ఊరట ఏమిటంటే.. ఆదివారం సాయంత్రం 6 గంటల సమయానికి నదిలో నీటిమట్టం సాధారణ స్థాయికి చేరుకుంది.

జోర్‌ లగాకే హైస్సా..

తపోవన్‌ ప్రాంతంలో ఒక సొరంగంలో చిక్కుకున్న 16 మందిని ఐటీబీపీ సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరిని కేవలం 2 మీటర్ల వెడల్పున్న గోతిలోంచి… ‘జోర్‌ లగాకే హైస్సా’ అని పెద్దగా అరుస్తూ తాడుతో పైకిలాగే దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

అధ్యయనానికి రెండు బృందాలు

ఉత్తరాఖండ్‌ ఘటనకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. డెహ్రాడూన్‌లోని వాదియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హిమాలయన్‌ జియాలజీకి చెందిన హిమానీనద శాస్త్రవేత్తలతో కూడిన రెండు బృందాలు సోమవారం ఉదయం చమోలీ జిల్లాకు బయలుదేరి వెళ్లనున్నాయి. ఒక బృందంలో ఇద్దరు, మరో బృందంలో ముగ్గురు శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని వాదియా ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ కాలాచంద్‌ సైన్‌ ఆదివారం వెల్లడించారు.

ఉత్తరాఖండ్‌ను వణికించిన విపత్తులు ఇవే..

ఉత్తరాఖండ్‌ను గతంలోనూ ప్రకృతి విపత్తులు వణికించాయి. వందలాది మంది ప్రాణాలను మింగేశాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన విలయాలు..

1991లో ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఏర్పాటు కాకముం దు ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది. దాని తీవ్ర త రిక్టర్‌ స్కేలుపై 6.8గా నమోదైంది. 768 మం ది చనిపోగా వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి.
1998లో కొండచరియలు విరిగిపడి ఏకంగా పితోరాగఢ్‌ జిల్లాలోని మల్పా అనే గ్రామమే తుడిచిపెట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో 255 మంది చనిపోయారు. వీరిలో కైలాశ్‌ మానససరోవర్‌ యాత్రికులు 55 మంది ఉన్నారు. ఆ శిథిలాల వల్ల శారదా నది ప్రవాహానికి కొంతమేర ఆటంకం కలిగింది.
1999లో చమోలి జిల్లాలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. 100 మంది వరకూ మరణించారు. భూకంప ధాటికి పొరుగు జిల్లా అయిన రుద్రప్రయాగలో కొండచరియలు విరిగిపడ్డాయి. రహదారులు బీటలువారాయి.
2013లో ఉత్తరాఖండ్‌లో ఒక భారీ జలవిలయం సంభవించింది. ఎడతెరిపిలేని వర్షాల ధాటికి వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 5,700 మంది మృత్యువాతపడి ఉంటారని ప్రభుత్వం అంచనా వేసింది. వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. చార్‌ధాం యాత్రా మార్గంలోని పలుచోట్ల దాదాపు 3లక్షల మంది చిక్కుకుపోయారు. ఇది చరిత్రలో ఒక దారుణమైన జల ప్రళయంగా మిగిలిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here