జాతి రత్నాలు’ సినిమా అందరి తలరాతలు మార్చేస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజైన అన్నీ చోట్లా పాజిటివ్ టాక్ తెచ్చుకొని భారీ వసూళ్ళను రాబడుతోంది. మహా శివరాత్రి పండుగకి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఆసినిమాలలో స్వప్న సినిమా బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు, శర్వానంద్ నటించిన శ్రీకారం, రాజేంద్ర ప్రసాద్ – శ్రీ విష్ణు నటించిన గాలి సంపత్. ఈ మూడు సినిమాలకి అభిమనుల నుంచి, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. మూడు సినిమాలలో ‘జాతి రత్నాలు’ సినిమా సంచలన విజయాన్ని అందుకొని కొత్త రికార్డులు సృష్ఠిస్తోంది. కోవిడ్ 19 తర్వాత అమెరికాలో రిలీజైన జాతి రత్నాలు ఊహించని విధంగా వసూళ్ళు రాబడుతోంది.

అంతేకాదు ఈ సినిమాలో నటించిన నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిలకి ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి గొప్ప గొప్ప ప్రశంసలు దక్కుతున్నాయి. మొదటి సినిమా ‘పిట్టగోడ’ కంటే ‘జాతి రత్నాలు’ సినిమాతో దర్శకుడు అనుదీప్ కీవి కూడా బాగా పాపులర్ అవుతున్నాడు. ప్రతీ ఒక్కరు సినిమాలోని నటీ నటుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమమలోనే ‘జాతి రత్నాలు’ సినిమాలో నటించిన చిట్టి ఫరియా అబ్దుల్లాకి మాస్ మహారాజా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు లేటెస్ట్ అప్‌డేట్. ఈ సినిమా ట్రైలర్ రిలీజైనప్పుడు ఈవిడేంటి ఇంత పొడవుంది అని ప్రభాస్ అన్న ఒక్క కామెంట్‌తో ‘ఫరియా అబ్దుల్లా’కి ప్రేక్షకుల్లో బాగా క్రేజ్ వచ్చింది. ఇక సినిమా రీలీజయ్యాక కూడా అందరి నుంచి ప్రశంసలు అందుకుంది. దాంతో ఇప్పుడు టాలీవుడ్ మేకర్స్ దృష్ఠి ఫరియా అబ్దుల్లా మీద పడిందంటున్నారు. కాగా రవితేజ ఖిలాడి తర్వాత త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతుండగా ఈ సినిమాలోనే ఫరియా అబ్దుల్లాకి అవకాశం వచ్చినట్టు సమాచారం. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ వస్తుందేమో చూడాలి.