రెండ్రోజులు గడప దాటకపోతే ఇల్లే ఓ జైలుగా అనిపిస్తుంది. అలాంటిది.. జైల్లో ఏడాది కాదు.. రెండేళ్లు కాదు దాదాపు 70 ఏళ్ల పాటు మగ్గితే? అదీ ఏ ఒక్కరోజూ బయటి ప్రపంచాన్ని చూడకుండా ఉంటే? అమెరికాకు చెందిన జోసెఫ్ లిగోన్ అనే వ్యక్తికి ఇలా దాదాపు జీవితకాలమంతా జైల్లోనే గడిచిపోయింది. ఇప్పుడు ఆయన వయస్సు 83 ఏళ్లు. 1953లో ఫిలడెల్ఫియాలో చోటు చేసుకున్న దోపిడీ, హత్య కేసులో 15 ఏళ్ల బాలుడిగా ఉన్న జోసె్‌ఫకు కోర్టు యావజ్జీవ కారాగారశిక్ష విధించింది. 1953 నుంచి 68 ఏళ్ల పాటు ఆయన పెన్సెల్వేనియా జైల్లో ఉన్నారు. మూడు, నాలుగుసార్లు పెరోల్‌పై బయటకొచ్చే అవకాశం కల్పించినా జోసెఫ్ తిరస్కరించారు. ఇటీవలే జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ప్రపంచంలో బాలనేరస్తుడిగా అత్యధిక కాలం జైల్లో గడిపిన వ్యక్తి జోసెఫే. జాన్ పేస్ అనే సహచరుడు జోసె్‌ఫను చేరదీశాడు.
