దేశరాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,101 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితులను గమనించిన కేజ్రీవాల్ సర్కారు బహిరంగ ప్రదేశాల్లో హోలీ తదితర ఉత్సవాలు నిర్వహించడంపై నిషేధం విధించింది. అలాగే కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేవారికి ర్యాండమ్ టెస్టులు చేయనున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్లు, బస్టాండులు, మొదలైన ప్రాంతాల్లో ఈ విధమైన టెస్టులు చేయనున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేలు దాటింది. కరోనాతో ఆసుపత్రులలో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది.
