
కరోనా సమయంలో మానవ జాతి ఎదుర్కొన్నఅంశాలపైనా.. మానసిక స్థితిపైన… భారతీయ జనతా యువ మోర్చా కవితలు, కథల పోటీ నిర్వహించింది. వీటిలో ఎంపిక చేసిన వాటిన ఊపిరి పూలు పేరుతో సంకలనాన్ని తీసుకొచ్చింది. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయడు ఊపిరి పూలు పేరుతో కథ, కవిత సంకలనాన్ని తీసుకొచ్చారు. ఈ పుస్తకాన్ని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీ సునీల్ ధియోధర్ గారు ఆవిష్కరించారు. వైజాగ్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.

కొవిడ్-19 ఎదుర్కోవడంతో పాటు ఇతర దేశాలకు సహాయం అందించడంలో భారత్ అగ్రగామిగా నిలిచిందని సునీల్ ధియోధర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వం భారత ప్రజలనేకాక ఇతర దేశాలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చిందన్నారు. పుస్తకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేసిన నాగోతు రమేష్ నాయుడు ను ఈ సందర్భంగా ఆయన అభినందించగా .. పుస్తకాన్ని స్వర్గీయ మాజి మంత్రి మాణిక్యాలరావు గారికి అంకితం ఇచ్చారు. విజేతలైన వారికి బహుమతులు అందించారు.
తొలి పుస్తకాన్ని బీజేపీ మాజీ అధ్యక్షులు హరిబాబు అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు కేతినేని సురేంద్ర మోహన్ , బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.