గల్ఫ్‌లో కరోనా ఆంక్షలు కఠినం

0
181
Spread the love

కరోనా కేసులు పెరుగుతుండటంతో గల్ఫ్‌ దేశాలు ఒక్కొక్కటిగా మళ్లీ ఆంక్షలను అమల్లోకి తెస్తున్నాయి.

విదేశాల నుంచి విమాన సర్వీసుల నిలిపివేతతో పాటు రోజువారీ ప్రజా జీవితానికి సంబంధించి నిబంధనలు విధిస్తున్నాయి. కొత్త సంవత్సరం ఆరంభం నుంచి గల్ఫ్‌లోని అన్ని దేశాల్లో పాజిటివ్‌లు పెరుగుతున్నాయి.

డిసెంబరు వరకు వంద లోపే కేసులు వచ్చిన సౌదీ అరేబియాలో.. బుధవారం 300 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో భారత్‌, అమెరికా, దక్షిణాఫ్రికా, యూకే, జపాన్‌ సహా 20 దేశాల నుంచి విమాన సర్వీసులను రద్దు చేసింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలను కొంతకాలం వాయిదా వేసుకోవాలని స్పష్టం చేసింది. షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌, హోటళ్లను పదిరోజులు మూసివేయాలని ఆదేశించింది.

విదేశీ ప్రయాణికుల రాకను కువైత్‌ రెండు వారాలు నిలిపివేసింది. ఈ నెలంతా దుకాణాలు ఉదయం 8 నుంచి సాయంత్రం 5 వరకు మాత్రమే తెరిచి ఉంచేలా మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నెల 25న జాతీ య దినోత్సవాన్ని కూడా రద్దు చేసింది. సెకండ్‌ వేవ్‌ ఆందోళన లో ఉన్న ఖతర్‌ సైతం ప్రజా జీవితంపై ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.

కొత్త ఏడాది వేడుకలు జరుపుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల నుంచి ప్రజలు రావడం.. పర్యటకానికి ప్రసిద్ధిగాంచిన దుబాయ్‌పై ప్రభావం చూపిం ది. దీంతో ఫిబ్రవరి నెలంతా బార్లు, పబ్‌లు మూసివేయాలని నిర్ణయించింది. యూఏఈ సైతం ఇదే నిర్ణయం తీసుకుంది.

కరోనా కొత్త స్ట్రెయిన్‌ తీవ్రంగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారికి పది రోజుల పాటు హోటల్‌ క్వారంటైన్‌ను యూకే ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. రెడ్‌ లిస్ట్‌లో ఉన్న 33 దేశాల (ప్రధానంగా దక్షిణాఫ్రికాతో పాటు, దక్షిణ అమెరికా దేశాలు) నుంచి వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని యూకే శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ దేశాల వారు ఏ మార్గంలోనూ వచ్చేందుకు వీల్లేకుండా ఆదేశాలిచ్చారు. అయితే, ఈ జాబితాలో భారత్‌ లేదు. మనం దేశం నుంచి యూకేకు ప్రస్తుతం పరిమిత సంఖ్యలో విమానాలు తిరుగుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here