ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్-సుక్మా జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం లో శనివారం మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భారీగా ఎదురుకాల్పులు జరిగాయి. రాత్రి కడపటి వార్తలందేసమయానికి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్‌రాజ్ పట్టిలింగం కథనం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం బీజాపూర్ జిల్లాలోని అటవీ ప్రాంతాలను డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా ప్రత్యేక బలగాలు జల్లెడపడుతున్నా యి.

తెర్రం అటవీ ప్రాంతంలో కూంబింగ్ జరిపిన 760 మంది జవాన్లకు 250 మంది మావోయిస్టులు తారసపడ్డారు. ఇరువర్గాల మధ్య భీకరంగా కాల్పులు మొదలయ్యాయి. ఈ ఘటనలో కోబ్రా దళానికి చెంది న ఒక జవాను, బస్తరీయ్(ఎస్టీఎఫ్) విభాగానికి చెం దిన ఇద్దరు, డీఆర్జీకి చెందిన మరో ఇద్దరు జవాన్లు మృతిచెందారు. 28 మంది గాయపడ్డారు. మారుమూల ప్రాంతం కావడంతో వారిని ఆస్పత్రికి తరలించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
భారత వాయు సేనకు చెందిన హెలికాప్టర్ల ద్వారా ఏడుగురు క్షతగాత్రులను రాయ్‌పూర్ ప్రభుత్వాస్పత్రికి, మరో 21 మం దిని బీజాపూర్ దవాఖానాకు తరలించారు. నక్సల్స్ వైపు 9 మంది మృతిచెంది ఉంటారని ఐజీ వెల్లడించారు. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నా రు. ఒక మహిళా నక్సల్ మృతదేహం లభ్యమైందని తెలిపారు. జవాన్ల మృతిపట్ల ఛత్తీ్‌సగఢ్ సీఎం భూపేశ్ బగేల్, ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.