దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తానే వారుసురాలినని ఆమె నెచ్చెలి శశికళ సంచలన ప్రకటన చేశారు. అన్నాడీఎంకేలోని కోట్లాదిమంది కార్యకర్తలను కాపాడేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నానని ప్రకటించారు. అక్రమార్జన కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను పూర్తిచేసుకుని సోమవారం ఉదయం బెంగళూరు నుంచి చెన్నైకి తిరిగి వచ్చారు. దారిపొడవునా 66 చోట్ల ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం’ పార్టీ ప్రముఖులు, కార్యకర్తల స్వాగత సత్కరాలు అందుకున్నారు.

పార్టీ నాయకుడు దినకరన్ నాయకత్వంలో 30 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. మార్గమధ్యంలో అక్కడక్కడా శశికళ మీడియాతో మాట్లాడారు. తిరుపత్తూరు వద్ద ఓపెన్‌టా్‌ప వ్యాన్‌పై నిలబడి అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. తాను అన్నాడీఎంకే పార్టీ పతకాన్ని ఉపయోగించడంపై మంత్రులు ఫిర్యాదు చేయడం వారిలో తన రాకవల్ల కలుగుతున్న భయానికి నిదర్శనమని చెప్పారు. తన రాకతో మంత్రుల్లో వణుకు ప్రారంభమైందన్నారు.