రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ ఐఐటీలో 25 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తాజాగా తేలింది. కరోనా సోకిన విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. జోధ్‌పూర్ ఐఐటీలో శానిటైజేషన్ చేయించారు.దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,20,95,855కు పెరిగింది. కరోనాతో 271 మంది మరణించారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. దేశంలో కరోనా అధికంగా ప్రబలుతున్న 10 జిల్లాల్లో 8 జిల్లాలు మహారాష్ట్ర, ఢిల్లీల్లోనే ఉన్నాయి. బీహార్ రాష్ట్రంలోనూ గత 72 గంటల్లో 664 కరోనా కేసులు వెలుగుచూశాయి.
