నరేంద్ర మోదీ బలమైన శత్రువు

0
168
Spread the love

ప్రధాని నరేంద్రమోదీ తమకు బలమైన శత్రువు అని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆయనను ప్రజల మద్దతుతో అహింసాయుత పద్ధతిలోనే ఓడిస్తామని ప్రకటించారు. ఇంతకన్నా బలమైన బ్రిటిషర్లనే ఓడించిన చరిత్ర కాంగ్రె్‌సదని చెప్పారు. తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్‌ ఆదివారం తిరునల్వేలి జిల్లా పాళయంకోట జేవియర్‌ కాలేజీలో విద్యావేత్తలతో సమావేశమయ్యారు. బ్రిటిష్‌ పాలకుల కన్నా మోదీ బలమైన శత్రువు కాదని, అలాంటి బ్రిటిషర్లనే భారత ప్రజలు దేశం నుంచి తరిమికొట్టారని అన్నారు. అలాగే మోదీని కూడా నాగ్‌పూర్‌ (ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రధాన కార్యాలయం)కు తరిమికొడతామన్నారు. ఓటమి తరువాత మోదీ రాజకీయంగా కనుమరుగవుతారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హిందుత్వకు ప్రతినిధిగా చెప్పుకొంటుందని, కానీ.. ఆచరణలో మాత్రం హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. ఇక మోదీ సర్కారు తెచ్చిన నూతన విద్యావిధానం.. పూర్తి అధికారాన్ని కేంద్రం చేతుల్లోకి తీసుకునేలా, దేశంలో విద్యా వ్యవస్థను దెబ్బతీసేలా ఉందని రాహుల్‌ ఆరోపించారు. విద్యను మతపరంగా మార్చేందుకు, భారత సమాజంపై ప్రత్యేక భావజాలాన్ని రుద్దేందుకు ఇచ్చిన ఆయుధంగా నూతన విద్యావిధానాన్ని అభివర్ణించారు. ఉప్పుమడి కార్మికులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here