నేను భారతీయుడిగా గర్విస్తున్నా. దేశాభివృద్ధిలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది.

నాకు భారతరత్న ఇవ్వాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వద్దు. దయచేసి అలాంటి పోస్టులు పెట్టొద్దు’’ అని రతన్ టాటా ట్విటర్‌లో కోరారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలంటూ ‘భారతరత్న ఫర్ రతన్ టాటా’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ వివేక్ బింద్రా ట్విటర్‌లో పెట్టిన పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగుండాలనే మాట కు ఆయన వ్యవహారశైలి నిలువెత్తు నిదర్శనం. ‘భారతరత్న’ పురస్కారం ప్రచారంపైనా అంతే హుం దాగా స్పందించిన రతన్‌టాటా ఆదర్శంగా నిలిచారు.