పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. చమురు కంపెనీలు శుక్రవారం లీటరు పెట్రోల్ ధరను 31 పైసలు, డీజిల్ ధరను 35 పైసలు పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.88.14కు, ముంబైలో రూ.94.64కు చేరింది.
అదేవిధంగా ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.78.38కి, ముంబైలో ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి రూ.85.32కు చేరుకుంది. నాలుగు రోజుల్లో పెట్రోల్ ధర రూ.1.21, డీజిల్ ధర రూ.1.25 పెరిగింది.

ఇక హైదరాబాద్‌లో శుక్రవారం లీటరు పెట్రోల్ ధర రూ.91.65కు, డీజిల్ ధర రూ.85.50కు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో పెరుగుదల ఇందుకు ఆజ్యం పోస్తోంది.
హైదరాబాద్‌లో
గురువారం శుక్రవారం శనివారం
పెట్రోల్ రూ.91.35 రూ.91.65 రూ. 91.96
డీజిల్ రూ.85.11 రూ.85.55 రూ. 85.89