పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసిన నిందితుడి కాల్చివేత

0
386
Spread the love

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన నిందితుల్లో ఒకడు పోలీసు కాల్పుల్లో మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిందీ ఘటన. నిందితుల్ని కోర్టుకు తీసుకెళ్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని నిలువరించేందుకు కాల్పులు ప్రారంభించారు. ఈ క్రమంలో నిందితుల్లో ఒకడు మరణించగా, మరో నిందితుడి కాలికి గాయమైంది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన లఖన్, అతడి స్నేహితుడు వికాస్‌లను ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు.  

ట్యూషన్ నుంచి వస్తున్న పదో తరగతి బాలికను కిడ్నాప్ చేసిన నలుగురు కుర్రాళ్లు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు పట్టుబడగా, మిగతా ఇద్దరూ పరారీలో ఉన్నారు. అత్యాచారం అనంతరం ఆమెతో బలవంతంగా విష పదార్థం తినిపించడంతో మృతి చెందింది. బాలికపై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని, మీరట్ రూరల్ ఎస్పీ కేశ్‌‌‌వ్ కుమార్ తెలిపారు. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేశామని, మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తునట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here