భారత్‌కు 36 రఫెల్‌ విమానాలు: రాజ్‌నాథ్‌

0
156
Spread the love

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: భారత్‌ కొనుగోలు చేసిన మొత్తం 36 రఫెల్‌ విమానాలూ వచ్చే ఏడాది ఏప్రిల్‌కు వాయుసేనలో చేరతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుతం 11 రఫెల్‌ విమానాలున్నాయని, వచ్చే నెలకల్లా ఆ సంఖ్య 17కు చేరుతుందని పేర్కొన్నారు. ఇక.. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి గత ఏడాది పాకిస్థాన్‌ ఏకంగా 5133 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని రాజ్‌నాథ్‌ రాజ్యసభకు తెలిపారు. ఆ కాల్పుల్లో 46మంది భారత సైనికులు మరణించారన్నారు. ఇదిలా ఉండగా.. చైనా తన దేశీయ తయారీ జే-20 విమానాలపై దృష్టి పెట్టింది. వాటిలోని రష్యా ఇంజన్ల స్థానంలో స్థానికంగా తయారుచేసిన శక్తిమంతమైన ఇంజన్లను అమర్చాలని భావిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here