భారత దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. దేశంలో 24 గంటల్లో 53,480 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 354 మంది మృతి చెందారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1,21,49,335కు చేరాయి. ఇప్పటి వరకు 1,61,468 మంది మరణించారు. ప్రస్తుతం 5,52,566 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,14,43,301 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా దేశంలో ఇప్పటి వరకు 6,30,54,566 మంది కరోనా టీకా వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది.
