గత ఏడాది సరిగ్గా ఇదే రోజుల్లో కరోనా తొలి దశతో అల్లాడిన మహారాష్ట్ర ఆ తర్వాత తేరుకుంది. కానీ, నెల రోజులుగా ఆ రాష్ట్రంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణం వైరస్ రెండో దశ అని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కాంటాక్టు ట్రేసింగ్ సరిగా లేకపోవడం, కేసుల గుర్తింపులో ప్రణాళిక కొరవడటం, రోగులు ఆలస్యంగా ఆస్పత్రుల్లో చేరడం, సరైన పర్యవేక్షణ లేకుండానే.. పెద్ద సంఖ్యలో పాజిటివ్‌లు హోం ఐసోలేషన్‌లో ఉండటం తో వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని తెలిపింది. మహారాష్ట్రలో గత వారం కేంద్ర బృందం పరిశీలన చేసింది. అందులో తేలిన అంశాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంగళవారం లేఖ రాశారు.

రాష్ట్రంలో ఒకరి నుంచి 20 మందికి వైరస్ సోకుతోందని, పరీక్షలు, పాజిటివ్‌ల కాంటాక్టు ట్రేసింగ్, క్వారంటైన్ వంటి అంశాల్లో ప్రభుత్వ చర్య లు నామమాత్రంగా ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘ప్రస్తుతం సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. పట్టణ వాసులే కాదు.. జాగ్రత్తల పాటింపులో పల్లె ప్రజలూ నిర్లక్ష్యంగా ఉన్నారు. కరోనాతో ఆస్పత్రుల్లో చేరినవారిలో మరణాల రేటు అధికంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో నమూనాలను జన్యు విశ్లేషణకు పంపడం సహా నిశిత పరిశీలన అవసరం’’ అని రాజేశ్ భూషణ్ ప్రస్తావించారు.
ఔరంగాబాద్‌లో పాజిటివ్ రేటు 30
కరోనా కట్టడికి గతేడాది ఆగస్టు-సెప్టెంబరులో చేపట్టిన తరహాలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని లేఖలో రాజేష్ భూషణ్ కోరారు. ఔరంగాబాద్‌లో పాజిటివ్ రేటు 30.. ముంబైలో 5.1 ఉందని కేంద్ర బృందం నివేదించినట్లు తెలిపారు. ‘‘పాజిటివ్‌లలో చాలామందికి పరీక్షలు చేయకపోవడంతో వ్యాప్తి తీవ్రంగా ఉంది. కాంటాక్టు ట్రేసింగ్ పరిమితం. లక్షణాలు కనిపించని, లక్షణాలు ఉన్నవారిని ముందుగానే గుర్తించి పరీక్షలు చేయలేదు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం ఇకపై పరీక్షలు పెంచండి. కేంద్రం నిర్దేశించిన మేరకు కట్టడి వ్యూహం అమలుపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించాలి. ఎంతటి విపత్కర పరిస్థితినిని ఎదుర్కొనేందుకైనా రాష్ట్రం సిద్ధంగా ఉండా లి’’ అని సూచించారు. కరోనాకు కళ్లెం వేసేందుకు మహారాష్ట్రకు కేంద్రం 14 అంశాలను నిర్దేశించింది.
దేశంలో ఆరో రోజూ 20 వేలపైనే కేసులు
దేశంలో వరుసగా ఆరో రోజూ 20 వేలపైనే కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం 24,492 మందికి వైరస్ సోకింది. 131 మంది చనిపోయారు. క్రితం రోజు తో పోలిస్తే పాజిటివ్‌లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఆదివారం పరీక్షల సంఖ్య తగ్గుదలే దీనికి కారణం. తాజా కేసుల్లో మహారాష్ట్రలో 15,051 రాగా.. కేరళ (1,054)ను వెనక్కునెట్టి పంజాబ్(1,818) రెండో స్థానానికి వచ్చిం ది. ఈ రాష్ట్రంలో మరణాలు (27) సైతం అధికంగానే ఉన్నాయి. శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు పాజిటివ్ అని తేలింది. మరోవైపు కర్ణాటక (932), గుజరాత్(890), ఢిల్లీ(450) సహా పది రాషా ్ట్రల్లో కేసులు అధికం అవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సహా ఇండోర్‌లో బుధవారం నుంచి రాత్రి కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
హైదరాబాదీ కంపెనీకి ‘స్పుత్నిక్-వి’ ఉత్పత్తి ఆర్డర్
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా కంపెనీకి రష్యన్ డైరెక్ట్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎ్‌ఫ) తో కీలక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా 25.2 కోట్ల స్పుత్నిక్-వి కరోనా వ్యాక్సిన్ డోసుల ఉత్పత్తితో పాటు పంపిణీ బాధ్యతలను గ్లాండ్ ఫార్మా చేపట్టనుంది. ఈ ఏడాది మూడో త్రైమాసికం (జూలై-సెప్టెంబరు) నాటికి ఉత్పత్తి ప్రక్రియ ప్రారం భం కానుందని గ్లాండ్ ఫార్మా మంగళవారం తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్‌లోని తమ కంపెనీ ఉత్పత్తి ప్లాంట్లకు రష్యా నుంచి స్పుత్నిక్-వి డోసుల తయారీ పరిజ్ఞానాన్ని బదిలీ చేస్తారని పేర్కొంది. మరోవైపు హైదరాబాద్‌కే చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ సైతం ఆర్‌డీఐఎ్‌ఫతో గత కొన్ని నెలలుగా కలిసి పనిచేస్తోంది. భాగ్యనగరి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే హెటెరో బయోఫార్మా కూడా 10 కోట్ల స్పుత్నిక్-వి డోసుల ఉత్పత్తికి సంబంధించి ఆర్‌డీఐఎ్‌ఫతో ఇప్పటికే ఒప్పందాన్ని కుదుర్చుకుంది.