మహారాష్ట్రలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మంత్రి ఒకరు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే ఉద్దవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్యఠాక్రేకు కరోనా సోకింది. తాజాగా రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి, ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక ట్వీట్ ద్వారా తెలిపారు. ఇటీవలి కాలంలో తనతో టచ్‌లో ఉన్నవారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరారు.

కాగా ధనంజయ్ ముండే రెండవమారు కరోనా బారిన పడ్డారు. గత ఏడాది జూన్‌లో ధనంజయ్ తొలిసారి కరోనా బారిన పడ్డారు. కాగా మహారాష్ట్రలో కొత్తగా 28,699 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 132 మంది మృతి చెందారు. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా బారిన పడిన 2,30,641 మంది చికిత్స పొందుతున్నారు. ముంబైలో కొత్తగా 3,514 కరోనా కేసులు, పూణెలో కొత్తగా 5,722 కరోనా కేసులు నమోదయ్యాయి.