లక్నోః సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో ఎపి సమాజ్ వాదీ
పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మురళీ మోహన్ యాదవ్ భేటీ అయ్యారు. అఖిలేష్ యాదవ్ స్వగృహంలో గురువారం ఈ సమావేశం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్.పి అభివృద్ధిపై ఈ సందర్భంగా చర్చించారు.
భవిష్యత్తులో పార్టీ బలోపేతం ఎలా చేయాలన్న అంశాలపై చర్చ జరిగింది. ఉత్తరప్రదేశ్ లో రాబోయే ఎలక్షన్లలో అఖండ మెజార్టీతో ఎస్.పి విజయం సాధిస్తుందని మురళీ మోహన్ యాదవ్ ఆకాంక్షించారు.
