కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ తిరుపతి లోక్‌సభ స్థానం బీజేపీ తరఫున పోటీచేయడం దాదాపు ఖరారైనట్లు తెలిసింది. బీజేపీ అధిష్ఠానం ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఒకట్రెండు రోజుల్లో పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమె పేరును ప్రకటించే అవకాశాలున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.

ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ.. కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిని. ఆ రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ వివిధ శాఖల్లో పనిచేశారు. కర్ణాటక సీఎ్‌సగా 2018లో పదవీవిరమణ చేసిన తర్వాత.. ఆమె ఆ రాష్ట్ర వొకేషనల్ స్కిల్స్ అథారిటీ చైర్‌పర్సన్ గా బాధ్యతలు నిర్వప్తించారు. 2019 ఏప్రిల్లో బీజేపీలో చేరారు. తిరుపతిలో రత్నప్రభను గెలిపించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించామని.. ఆమె విజయంతో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేశామని చెప్పేందుకు ఆస్కారం కలుగుతుందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.