విశాఖను వీడని ప్రమాదాలు.. ఫార్మా కంపెనీలో పేలుడు

0
485
Spread the love

విశాఖపట్నంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మరోసారి నగరంలోని ఓ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించింది. వివరాలు.. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో మంగళవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకుంది. దీంతో కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.

అయితే సమీపంలోనే ఫైరింజన్‌ ఉంటడంతో.. మంటలను అదుపు చేయగలిగారు. పేలుడు ధాటికి కంపెనీ పరిసరాల్లోని పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే మంటలు సకాలంలో అదుపులోకి రావడంతో పెను ప్రమాదం తప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here