6లక్షల కోట్లతో పోర్టుల అభివృద్ధి

0
151
Spread the love

సాగరమాల పథకం కింద దేశంలోని నౌకాశ్రయాలను 2035 కల్లా అభివృద్ధి చేయడానికి 6 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. జలమార్గాల అభివృద్ధి, జలవిమాన సర్వీసులు, షిప్‌యార్డులు, లైట్‌హౌ్‌సల వద్ద పర్యాటక అభివృద్ధి… మొదలైన 574 ప్రాజెక్టులను గుర్తించామని, వీటిలో సుమారు 400 దాకా పెట్టుబడులకు వీలున్న ప్రాజెక్టులని ఆయన తెలిపారు. సుమారు 31 బిలియన్‌ డాలర్ల మేర ఈ 400 ప్రాజెక్టుల్లో విదేశీ, స్వదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు ఆయన మంగళవారంనాడు మారిటైమ్‌ ఇండియా శిఖరాగ్ర సదస్సులో చేసిన ప్రసంగంలో పేర్కొన్నారు. ‘భారత సముద్ర తీరం, కష్టించి పనిచేసే భారతీయులు మీకోసం ఎదురుచూస్తున్నారు. మీ వ్యాపారానికి అనువైన కేంద్రం భారత్‌.. పెట్టుబడులతో రండి’ అని మోదీ పిలుపునిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here