
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు,ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. 82 ఏళ్ల ములాయం సింగ్ యాదవ్ తన రెగ్యులర్ మెడికల్ చెకప్‌లు, పరీక్షల కోసం ఆగస్టు 22 నుండి చికిత్స పొందుతున్నారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మధ్యాహ్నం ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ఆయన ప్రాణాలను నిలపడానికి డాక్టర్లు శాయశక్తులా ప్రయత్నించారు. అత్యాధునిక వైద్య సేవలను అందించారు. అయినప్పటికీ- ఫలితం రాలేదు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో నేతాజీగా ప్రాచుర్యం పొందిన ములాయం..యూపీలోనే కాకుండా,దేశ రాజకీయాల్లోనూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేంద్రంలో ప్రాంతీయ పార్టీలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో విజయవంతమయ్యారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి చవిచూడగా బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే బలం లేదు. 1996, 1998లో వరుసగా హెచ్డీ దేవెగౌడ, ఐకే గుజ్రాల్ సారథ్యంలో తృతీయ కూటమి ప్రభుత్వాల ఏర్పాటులో ములాయం చక్రం తిప్పారు. అప్పటి నుంచి కేంద్రంలో మొదలైన ప్రాంతీయ పార్టీల ప్రాముఖ్యం, ప్రాబల్యం ఇంకా కొనసాగుతోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటవా జిల్లాలోని సైఫాయి గ్రామంలో 1939 నవంబర్ 22న మూర్తిదేవి-సుఘర్‌సింగ్ యాదవ్ దంపతులకు యులాయం సింగ్ యాదవ్ జన్మించారు. ఆగ్రా యూనివర్సిటీ నుంచి రాజకీయ విజ్ఞానశాస్త్రంలో MA పూర్తి చేశారు. స్వతహాగా రెజ్లర్ అయిన ములాయం.. 15ఏళ్ల వయసులోనే సోషలిజం పట్ల ఆకర్షితులైన ములాయం ప్రముఖ సోషలిస్టు నేతగా గుర్తింపు పొందిన రామ్ మనోహర్ లోహియా ప్రభావానికి లోనయ్యారు. ఆయన సారథ్యంలో సాగిన సోషలిస్టు ఉద్యమంలో పాల్గొన్న ములాయం 3నెలలు జైలులో ఉన్నారు. 1962లో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్ ఆయన జీవితాన్ని గొప్ప ములుపు తిప్పింది. జశ్వంత్‌నగర్‌లో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో సత్తాచాటిన ములాయం యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ నేత నాథూసింగ్‌ను ఆకర్షించారు. ములాయంను ఆయన యూపీ రాజకీయ యవనికపై పరిచయం చేస్తే.. కేంద్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించి ములాయం అనతికాలంలోనే జాతీయ నేతగా గుర్తింపు పొందారు. 1967 ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో నాథూసింగ్.. ములాయం సింగ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి మొదలైన ములాయం రాజకీయ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది.
1992లో సమాజ్‌వాదీ పార్టీ(SP)ని స్థాపించిన ములాయం సింగ్.. ఉత్తరప్రదేశ్‌లో దానిని తిరుగులేని శక్తిగా మార్చారు.సఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మూడు సార్లు చేశారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్ అయిన ములాయం యునైటెడ్ ఫ్రంట్ సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు. ములాయం 1967లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి ములాయం మొత్తం 8 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో నేతాజీగా ప్రాచుర్యం పొందిన ములాయం..యూపీలోనే కాకుండా,దేశ రాజకీయాల్లోనూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.