యూపీలో ఘోరం.. కబడ్డీ ప్లేయర్స్‌కి టాయిలెట్లలో భోజనాలు.. షాకింగ్ వీడియో..

0
213
Spread the love

ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగు చూసింది. టాయిలెట్లలో కబడ్డీ ప్లేయర్లకు భోజనాలు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. యూపీలోని సహరన్‌పూర్‌ ఇటీవల ఓ స్టేట్‌లెవెల్‌ కబడ్డీ టోర్నమెంట్‌ నిర్వహించారు. అండర్‌-17 ప్లేయర్స్‌ అంతా పాల్గొన్నారు. ఆటకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు బిల్డప్పైతే ఇచ్చారు కానీ అక్కడ పరిస్థితి ఘోరంగా ఉంది. తినే ఆహారాన్ని టాయిలెట్లలో ఏర్పాటు చేసి.. పిల్లల్ని దారుణంగా అవమానించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లంచ్‌ సమయంలో.. క్రీడాకారులంతా.. ఆ బాత్రూంల్లోకి వచ్చి.. అక్కడ ఉన్న ఆహారాన్ని తిన్నారు. వాళ్లే వడ్డించుకోవాల్సివచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ అయింది. ఇక ఈ వీడియోను చూసిన.. నెటిజన్లు.. యోగి సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్లను ఇలా అవమానిస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.

టాయ్‌లెట్‌ కాస్త క్లీన్‌గా లేకపోతేనే యూజ్‌ చేయడానికి ఇబ్బంది అనిపిస్తుంది. అలాంటిది.. ఏకంగా అక్కడ వంటపాత్రలు ఉంచి వాటిల్లోంచే వడ్డించుకుని తినమంటే ఎంత ఘోరం. ఈ వీడియో వైరల్ అవడంతో బాధ్యులైన స్పోర్ట్స్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేశారు. కానీ ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మాత్రం పొంతనలేని సమాధానాలు చెప్తున్నారు. పిల్లల కోసం వంటలన్నీ స్విమ్మింగ్‌ పూల్ పక్కనే వండించారని, కానీ వర్షం పడుతుండడంతో ఆహార పదార్థాల్ని బాత్‌రూమ్‌ దగ్గర పెట్టాల్సి వచ్చిందని అంటున్నారు.

స్టేడియంలో రిపేర్‌ పనులు జరుగుతున్న కారణంగా ఇలా చేయాల్సి వచ్చిందని మరో తెరపైకి తీసుకొచ్చారు. ఈ మొత్తం ఎపిసోడ్‌లో యోగీ సర్కార్‌ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here