
కైపుతో కవ్వించి సమాజంలో పేరున్న వారిని, ప్రముఖులను, బడాబాబులను కొంగుకు చుట్టుకుంది. వారితో ఏకాంతంగా గడిపే సమయంలో వీడియోలు తీసి దాచి పెట్టుకుంది.వారితో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిలింగ్‌కి దిగి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుంది. కొంత కాలంగా రాష్ట్రంలో సంచలనంగా మారిన ఈ మాయలాడిని ఎట్టకేలకు భువనేశ్వర్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. నిందితురానికి భువనేశ్వర్‌లోని సత్య విహార్ ప్రాంతానికి చెందిన అర్చన నాగ్ గా గుర్తించారు. ఆమె దగ్గరి నుంచి ఫోన్లు, రెండు పెన్ డ్రైవ్‌లు, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ఆమెకు భువనేశ్వర్‌లో ఖరీదైన భవనం ఉంది.
మాయ లేడి బ్లాక్ మెయిలర్ అర్చన నాగ్ ను పోలీసులు విచారిస్తున్న కొద్దీ వెలుగుచూస్తున్న వాస్తవాలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మీడియా కథనాలు, పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. 64 మంది ప్రముఖులతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2015లో కలహండి జిల్లాలో కెసింగ అనే ప్రాంతం నుంచి భువనేశ్వర్ వచ్చిన అర్చన అనతి కాలంలోనే రూ.కోట్లకు ముంబై పోలీసులు ఆదాయపు పన్ను శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో సంపన్నులు, ఉన్నతాధికారులతో స్నేహం చేస్తుంది. తర్వాత మాటలతో ముగ్గులోకి దింపి తన నివాస భవనంలోకి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉండి.ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించేది. తర్వాత అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌మీడియాలో పెడతానని బెదిరిస్తుంది. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు బీఎండబ్ల్యూ, ఫోర్డు కార్లున్నాయి. ఓ ఫార్మ్ హౌస్ కూడా ఉంది. హై-ప్రొఫైల్ కస్టమర్ల పేర్లను మాత్రం ఆమె ఇంతవరకు వెల్లడించలేదు.
మంత్రి, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు తెలియడంతో.. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన బీజూ జనతా దళ్, బీజేపీ, కాంగ్రెస్ నేతల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు సైతం ఇదే పరిస్థితిలో ఉన్నారు. రాష్ట్రంలో అర్చన వ్యవహారం కాక రేపుతుండడంతో పోలీసు అధికారులు సెలవు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, మగవారి బలహీనతతో అడ్డదారుల్లో సంపాదించిన అర్చనకు పాత కార్ల షోరూం, ఆదిత్య ప్రెస్టేజ్ లిమిటెడ్ తో పాటు మరో కంపెనీ ఉంది. భువనేశ్వర్ సత్య విహార్ ప్రాంతంలో రూ. కోట్ల విలువ చేసే భవంతిని నిర్మించి, 2021 జనవరి నెలలో ఎమ్మెల్యే సూర్యనారాయణ పాత్రలతో ప్రారంభం చేయించింది.
అర్చన నాగ్ దాదాపు 20 మంది హై-ప్రొఫైల్ సెక్స్ వర్కర్లను నియమించుకుంది. ఎల్లప్పుడూ సంపన్న కస్టమర్ల కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ సెక్స్ వర్కర్లు తమ సేవలను అందించే ప్రముఖ వ్యక్తులతో ఫోటోగ్రాఫ్‌లు క్లిక్ చేయాలని ఆమె ఆదేశించింది. తర్వాత ఆ ఫొటోలను ఉపయోగించి వారిని బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసింది. అర్చన నాగ్‌తో కలిసి పనిచేస్తున్న సెక్స్ వర్కర్ల ఫోటోలు, ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా వివరాలను కూడా పోలీసులు బయటపెట్టారు. ఆమెను అరెస్టు చేసిన తర్వాత, అర్చన నాగ్ బ్యాంక్ ఖాతాలు మరియు ఫిక్స్‌డ్ డిపాజిట్ల గురించి వివరాలను తెలుసుకోవడానికి పోలీసులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి లేఖ రాశారు.
అర్చనను విచారిస్తున్న పోలీసులు ఆమె చెప్పిన పేర్లు, ఈమెయిల్, పెన్ డ్రైవ్ లోని సమాచారం చూసి నివ్వెరపోతున్నారు. ఒక మంత్రి, పశ్చిమ ఒడిస్సాలో గుర్తింపు ఉన్న బీజేపీ నేత, శాసనసభ్యులు, బిల్డర్లు, సినీ నిర్మాతలు, పోలీసు అధికారులు, వారికి సంబంధించిన నగ్న చిత్రాలు చూసి షాక్ అయ్యారు. మంత్రి, అర్చన కలిసి నగ్నంగా ఉన్న చిత్రాలను గుర్తించిన పోలీసులు వాటితో ఆయనకు రూ. 5 కోట్లు, ఎమ్మెల్యేల నుంచి రూ. కోటి డిమాండ్ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారమంతా ఆమె భర్త జోగ బంధు నాగ్ సహకారంతో నడిచిందని, రహస్య కెమెరాలు పెట్టడం, రికార్డు చేయడం అతడే చేసినట్లు తెలిసిన పోలీసులు పరారీలో ఉన్న జోగ బంద్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.