టాలీవుడ్‌ నుంచి వస్తోన్న హాలీవుడ్‌ ఫిల్మ్‌.. ‘మోసగాళ్ళు’

0
194
Spread the love

ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ వంటి హిట్ చిత్రాలతో కలెక్షన్‌ కింగ్‌, మంచు మోహన్‌ బాబు వారసుడిగా, వెర్సటైల్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు విష్ణు. మరో వారసుడు మంచు మనోజ్‌.. సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటే, మంచు విష్ణు మాత్రం మంచు ఫ్యామిలీ అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు. వైవిధ్యభరిత చిత్రాలతో ఇప్పటికే నటుడిగా మంచి గుర్తింపు పొందిన విష్ణు.. నిర్మాతగానూ సక్సెస్‌ఫుల్‌ చిత్రాలను ఇండస్ట్రీకి ఇస్తున్నాడు. ఆయన హీరోగా, నిర్మాతగా హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న చిత్రం ‘మోసగాళ్ళు’. ఏవిఏ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి మంచు విష్ణు ఈ చిత్రాన్మి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికున్న విశేషం ఏమిటంటే.. స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌.. మంచు విష్ణు సోదరిగా ఈ చిత్రంలో నటించింది. అంతేకాదు ఈ సినిమాలో మరెన్నో విశేషాలు ఉన్నట్లుగా ఇటీవల వచ్చిన ట్రైలర్‌ చెప్పకనే చెప్పేసింది.

రియల్ ఇన్సిడెంట్స్‌తో ప్రపంచంలో జరిగిన బిగ్గెస్ట్ ఐటీ స్కామ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా మార్చి 19న విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ట్రైలర్‌ని ఇటీవలే మెగాస్టార్‌ చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. ట్రైలర్‌ ఆసక్తికరంగా ఉండటమే కాదు.. హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందనేలా ట్రైలర్‌ చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారంటే.. ఏ రేంజ్‌లో ఈ సినిమా తెరకెక్కిందో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇటువంటి సినిమాలను రూపొందించడానికి ఘట్స్‌ కావాలి. అలాంటి ఘట్స్‌ ఈ మంచు వారసుడిలో టన్నులకి టన్నులు ఉందనే దానికి నిదర్శనంగా ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో వదులుతున్నారు. హాలీవుడ్‌ స్థాయికి ఈ చిత్రం తెరకెక్కిందని, దర్శకుడు జెఫ్రీ అలా తెరకెక్కించారని.. స్వయంగా మంచు విష్ణు చెప్పడం అందరికీ తెలిసిందే. అలాగే ట్రైలర్‌ కూడా అదే చెబుతోంది. ట్రైలర్‌లో ఒక్కొక్క షాట్‌ చూస్తుంటే.. నిజంగా ఇది మంచు విష్ణుకే సాధ్యం అని అంతా అంగీకరించకమానరు.

ఇక ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి పాత్ర చాలా కీలకమైన పాత్ర. ఆయనకు ఈ స్టోరీ చెప్పగానే అస్సలు ఆలోచించకుండా చేస్తానని చెప్పాడట. అలాగే నవదీప్‌, నవీన్‌ చంద్ర వంటి యంగ్‌ హీరోలు, వైవా హర్ష వంటి కమెడియన్‌కి ఈ సినిమాలో కీలకపాత్రలు దక్కాయి. మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌ వంటి వారు ఈ సినిమా కథ గురించి అడిగిమరీ తెలుసుకున్నారంటే.. ఈ సినిమా ప్రేక్షకులకు ఎటువంటి కిక్‌ ఇవ్వబోతుందో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్‌గా మంచు విష్ణు దారి రహదారి అనేలా.. వైవిధ్యభరిత సబ్జెక్ట్‌లతో.. రొటీన్‌కి భిన్నంగా వెళుతూ.. నటుడిగా, నిర్మాతగా తన సత్తా చాటుతున్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన స్థాయి, రేంజ్‌ ఏ తరహాలో మారిపోతాయో అనే చర్చలు కూడా అప్పుడే ఇండస్ట్రీలో మొదలయ్యాయి. ‘మోసగాళ్ళు’ చిత్రం తర్వాత ఆయన డైరెక్ట్‌గా హాలీవుడ్‌ ఫిల్మ్‌ అనౌన్స్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్‌లోని కొందరు అనుకుంటున్నారంటే.. ఈ చిత్రంపై వారికి ఎంత నమ్మకం ఉందో తెలిసిపోతుంది. చూద్దాం.. ఈ సినిమా మంచు విష్ణుని ఏ రేంజ్‌కి తీసుకువెళుతుందో..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here