టిక్‌టాక్‌స్టార్‌కు ఊహించని షాక్‌: తృటిలో తప్పిన ప్రాణాపాయం

0
287
Spread the love

అని ఒక సముద్ర జీవిని చేతుల్లోకి తీసుకొని మురిసిపోయింది. బుజ్జి..బుజ్జిగా భలే ఉంది అనుకుంటూ సరదాగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ తరువాత విషయం తెలిసి షాక్‌ అయింది. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవినా ఇంతసేపు తాను పట్టుకున్నదీ అని గజగజ వణికిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకుంది.

Oblivious woman holds one of the world's most dangerous animals for photo

వివరాల్లోకి వెళితే…కైలిన్ మేరీ అనే మహిళ బాలీ దీవులకు విహారయాత్రకు వెళ్లారు. అక్కడి బీచ్‌లో గోధుమరంగు శరీరం, గుండ్రటి మచ్చలతో అందంగా కనిపించిన చిన్న అక్టోపస్‌ను అబ్బురంగా తన అరచేతితో పట్టుకుంది. ఆ ఫోటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఆ తరవాత ఆసక్తికొద్దీ దీనిపై ఆన్‌లైన్‌లో సెర్చ్‌ చేసింది. అప్పుడు అర్థమైం‍ది అమెకు అసలు సంగతి. సముద్రంలో ప్రాణాంతక జంతువులలో ఒకటిగా పరిగణించే నీలిరంగు అక్టోపస్‌ అని. చూడ్డానికి చాలా చిన్నదిగా కనిపించినా, ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జీవి అని తెలుసుకొని నివ్వెరపోయింది. ఈ భయానక సంఘటనపై తన తండ్రికి ఫోన్‌ చేసి భావోద్వేగానికి లోనైంది. ఈ విషయాలను ఆమె నెటిజనులతో పంచుకున్నారు. దీంతో వారుకూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు. అదృష్టవంతులు..మీకు ఎలాంటి ప్రమాదం జరగనందుకు సంతోషం వ్యక్తం చేశారు.

నీలిరంగు చుక్కల ఆక్టోపస్ : కేవలం 12 నుండి 20 సెం.మీటర్ల పరిమాణంతో చిన్నగా ఉన్నప్పటికీ ఇది చాలా విషపూరితమైన సముద్ర జీవి. ఈ నీలిరంగు చుక్కల ఆక్టోపస్‌లు మానవులకు ఎంత ప్రమాదకర మైనవంటే 26 మందిని నిమిషాల్లో అంతం చేసేంత విషాన్ని కలిగి ఉంటాయి. ఇది కాటు వేసినపుడు ఎలాంటి నొప్పి తెలియదట. విష ప్రభావంతో శ్వాసకోస ఇబ్బంది, పక్షవాతం లాంటి లక్షణాలతో బాధితులు విల విల్లాడుతున్నపుడు తప్ప విషయం అర్థం కాదట. అంతేకాదు దీని విషయానికి ఇంతవరకూ విరుగుడు కూడా అందుబాటులో లేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here