మాజీ క్రికెటర్, టీవీ నటుడు సలీల్ అంకోలాకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. పుట్టినరోజుకు ఒకరోజు ముందు తనకు కరోనా సోకిందని నటుడు సలీల్ అంకోలా ఆసుపత్రిలో చేరిన చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కరోనా వైరస్ వల్ల ఊపిరిపీల్చడంలో సమస్య తలెత్తడంతో తాను ఆసుపత్రిలో చేరానని సలీల్ అంకోలా చెప్పారు.‘‘రేపు నా పుట్టినరోజు…జన్మదినోత్సవం రోజే నాకు కరోనా సోకడం మరపురాని పుట్టిన రోజు. కరోనా వల్ల నాకు భయంగా ఉంది, మీ ఆశీర్వాదంతో నేను త్వరలో కోలుకొని తిరిగి వస్తాను’’ అంటూ సలీల్ అంకోలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.టీవీ నటుడు సలీల్ అంకోలా త్వరగా కోలుకోవాలని కోరుతూ టీవీ పరిశ్రమ సహచరులు సందేశాలు రాశారు.
