
నిరుద్యోగ యువతీ, యువకులకు ఆసక్తి ఉన్న వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు టెక్ మహీంద్రా సంస్థ ప్రతినిధి నాగరాజు తెలిపారు. ఎం.ఎ్‌స.ఆఫీస్, స్పోకెన్ ఇంగ్లిష్, టైపింగ్, రిటైల్ సేల్స్ తదితర అంశాలలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్హత మొదలుకొని డిప్లొమా, డిగ్రీ, పీజీ అభ్యర్థులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. 18 సంవత్సరాల నుంచి 27 ఏళ్ల లోపు వయసు ఉండి, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఫోన్ 9100056583, 8885512037 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈ నెల 31వ తేదీలోగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.